Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

డల్‌ సీజన్‌ ఎఫెక్ట్‌ టాలీవుడ్‌ మార్కెట్‌పై తీవ్రంగా ఉంది. ఇప్పుడు రిలీజ్‌ అవుతోన్న చిత్రాలని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు. క్రికెట్‌ ఫీవర్‌, ఎగ్జామ్స్‌ టైమ్‌ బిజినెస్‌పై ఎఫెక్ట్‌ చూపిస్తోంది. గత వారం వచ్చిన రామ్‌లీల, భమ్‌ బోలేనాధ్‌ చిత్రాలు నిరాదరణకి గురయ్యాయి. 

డబ్బింగ్‌ చిత్రాలైన మగమహారాజు, పిశాచి కాస్తయినా ఫర్వాలేదనిపించాయి కానీ స్ట్రెయిట్‌ సినిమాల్ని అస్సలు పట్టించుకోలేదెవరూ. అల్లరి నరేష్‌ ఖాతాలో మరో డిజాస్టర్‌గా మిగిలింది బందిపోటు. ఈ చిత్రం ఇటీవలి కాలంలో వచ్చిన అతని సినిమాల్లోనే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 

టెంపర్‌ ఇప్పటికీ వీకెండ్స్‌లో షేర్స్‌ తెచ్చుకుంటోంది కానీ ఈ సినిమా బిజినెస్‌ అయితే క్లోజింగ్‌ స్టేజ్‌కి చేరుకుంది. చాలా కేంద్రాల్లో నెట్‌ ఫ్రీ బేసిస్‌లో రన్‌ అవుతోన్న ఈ చిత్రం బయ్యర్లకి స్వల్ప నష్టాలు తెచ్చిందని ట్రేడ్‌ రిపోర్ట్‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?