Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎవరికి వాళ్లే పక్కవాళ్లదంటున్నారు

ఎవరికి వాళ్లే పక్కవాళ్లదంటున్నారు

ఓ సినిమాను ఇద్దరు కలిపి నిర్మిస్తే లేదా ఆ సినిమాలో ఇద్దరు ఏదో రకమైన భాగస్వామ్యం తీసుకుంటే సాధారణంగా ఇద్దరూ ఆ సినిమా తమదే అంటారు. కానీ ఫస్ట్ తేదీన విడుదలవుతున్న రోజులు మారాయి సినిమా వైనం చిత్రంగా వుంది. ఆ సినిమాకు సంబంధించినంత వరకు తాను కథ మాత్రమే ఇచ్చానని, అది దిల్ రాజు సినిమా అని. ఆయన సినిమాలు ఎలా వుంటాయో, ఇదీ అలాగే వుంటుందని అంటున్నారు డైరక్టర్ మారుతి.

మరి దిల్ రాజు ఏమంటున్నారో చదవండి...''- సాధార‌ణంగా దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సినిమా అంటే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ అనే ముద్ర ప్రేక్షకుల మ‌న‌సులో ప‌డిపోయింది. అలాగ‌ని ఈ సినిమా గురించి త‌ప్పు చెబుతున్నాన‌ని కాదు, నా బ్రాండ్ సినిమాలు ఇలాంటి కావ‌ని ఆడియెన్స్ అభిప్రాయం. బిజినెస్ యాంగిల్‌లో చేసిన సినిమా. అందుక‌ని ఈ సినిమాను మేమే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాం..'' 

దిల్ రాజు మాటలు కాస్త కన్ ఫ్యూజ్డ్ గా లేవూ... మా సినిమాలు అంటే ఫ్యామిలీ సినిమాలు.. అలాగని ఈ సినిమా గురించి తప్పు చెప్పడం లేదూ అంటున్నారు.. అంటే ఏమిటో? నా బ్రాండ్ సినిమాలు ఇలాంటివి కావు అంటున్నారు. అంటే ఎలాంటి బ్రాండ్ అని దిల్ రాజు ఉద్దేశమో? పైగా బిజినెస్ ఏంగిల్ లో చేసారట.. అంటే ఇందులో ఏమిటి వుంటాయో? :హిట్ కావాలే కానీ అప్పుడు అందరూ ఈ సినిమా మాదే అంటూ వీళ్ళే ప్రచారం చెసుకొరూ..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?