Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎవరూ కొనలేదా 'గురూ?'

ఎవరూ కొనలేదా 'గురూ?'

క్రీడల నేపథ్యంలో టాలీవుడ్ లో సినిమాలు వచ్చిందే తక్కువ. హిట్టయింది మరీ తక్కువ. అందుకే పెద్దగా ఎవరూ ట్రయ్ చేయరు. అయితే వైవిధ్యమైన సినిమాలు చేస్తే తప్ప సీనియర్ హీరోలకు మనుగడ లేని రోజులు ఇవి.అందుకే విక్టరీ వెంకటేష్ గురు సినిమాను ఓకె చేసారు. దీనికి కొన్ని కమర్షియల్ టచ్ లు అయితే వున్నాయి కానీ, మన వాళ్లకు ఏ మేరకు నచ్చుతుందో అన్నది అనుమానం. ఈ డవుట్ మేకర్లకు కూడా లేకపోలేదు. అందుకే చాలా తెలివిగా మేక్ చేసారు.

తమిళ్ సినిమా సీన్లను వీలయినంత వరకు అలాగే వుంచుతూ, హీరోకు సంబంధించిన కొన్ని మాత్రం రీ షూట్ చేస్తూ, చాలా తక్కువ బడ్జెట్ లో చేయగలిగారు. హీరోకు రెమ్యూనిరేషన్ ఇవ్వకుండా శాటిలైట్ రైట్స్ ఇచ్చేసారు. అందువల్ల చాలా లో బడ్జెట్ లో గురు ముస్తాబయిపోయిందని తెలుస్తోంది. అంటే డబ్బింగ్ సినిమాకు ఎక్కువ, రీమేక్ కు తక్కువ అన్న టైపు అన్నమాట.

ఇంత వరకు స్మూత్ గానే జరిగిపోయినా, రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంక్వయిరీలు రాలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాని వల్ల ఇప్పుడు సురేష్ మూవీస్ ద్వారా నేరుగా విడుదల చేసుకుంటున్నారు. క్లాస్ ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తుందని, బి సి సెంటర్లలోని రెగ్యులర్ సినిమా లవర్స్ స్పందన బట్టి సినిమా విజయం ఆధారపడి వుంటుందని టాక్ వినిపిస్తోంది. 

డైరక్ట్ పంపిణీ ద్వారా వచ్చిన షేర్ లో ఖర్చులు పోను, తెరవెనుక వున్న భాగస్వాములకు ఇవ్వగా మిగిలింది నిర్మాతలకు. మరి ఏ మేరకు కిట్టుబాటు అవుతుందో చూడాలి.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?