Home > Movies - Movie Gossip
దర్శకుడు.. హీరోయిన్.. తెల్లారేదాకా ఎంజాయ్ చేశారట!

ఫర్హాన్ అక్తర్ తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రేమ కథ చాలా ఘాటుగానే సాగుతున్నట్టుగా ఉంది. లేదు.. లేదు.. అంటున్నారు కానీ.. వీరిద్దరూ మీడియాకు ఏదో విధంగా చిక్కుతూనే ఉన్నారు. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటి గురించి వీరిద్దరూ గుంభనంగా ఉండి పోయారు. అందుకు సంబంధించి చాలా అప్ డేట్సే వచ్చినా వీరివురూ స్పందించనే లేదు. 

ఆ సంగతలా ఉంటే.. మొన్న శనివారం రాత్రి ఫర్హాన్ ఇంటికి శ్రద్ధాకపూర్ చేరుకుందని ‘స్పాట్ బాయ్’ ఒక ప్రత్యేక కథనాన్ని ఇస్తోంది. ఈమె చాలా తెలివిగా వ్యవహరించిందని.. జూహూ ప్రాంతంలోని ఫర్హాన్ ఇంటికి తన కారులో చేరుకున్న శ్రద్ధ.. ఆ వెంటనే కారును అక్కడ నుంచి పంపించి వేసిందని ‘స్పాట్ బాయ్’ పేర్కొంది. మీడియా వర్గాలు ఆ కారును వెంబడించుకొంటూ వెళ్లాయని.. ఆ విధంగా వారిని డైవర్ట్ చేసి.. తను మాత్రం ఫర్హాన్ ఇంటికి చేరిపోయిందనేది ఆ కథనం సారాంశం. 

శనివారం రాత్రి ఎనిమిదింటికి శ్రద్ధా పర్హాన్ ఇంటికి చేరిందని.. మళ్లీ తెలతెలవారుతుండగా.. రెండున్న, మూడు గంటల సమయంలో.. ఆమె కారు మళ్లీ ఫర్హాన్ ఇంటి దగ్గరకు వచ్చిందని, అందులో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయిందనేది బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మరి రాత్రి ఎనిమిదన్నర నుంచి తెల్లవారుఝాము రెండున్నర వరకూ ఏం జరిగిందనేది.. చదువరుల ఊహకు వదిలిపెట్టాయి ఈ పత్రికలు. 

మరి స్పాట్ లో జరిగిందంటూ మీడియా వర్గాలు ఇస్తున్న సమాచారం చాలా స్పైసీగానే ఉంది. ఫర్హాన్, శ్రద్ధాల రొమాన్స్ చాలా ఘాటుగానే ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కూతురు తీరుతో శక్తి కపూర్ తలపట్టుకున్నాడట. తెల్లవారుఝాము వరకూ ఇంటికి రావడం లేదని బాధపడుతున్నాడట. అయినప్పటికీ.. అమ్మడు ఏం తగ్గేలా లేదు! ప్రేమలో ఉండి... స్వతంత్రం కూడా ఉంటే ఇంతేనేమో!