Advertisement


Home > Movies - Movie Gossip
ఫస్ట్ లుక్కులూ లేటేనా?

సినిమాల విడుదల డేట్ ఊరికి ముందే ప్రకటిస్తారు. కానీ తీరా చేసి, విడదల తేదీ దగ్గరకు వచ్చాక కిందా మీదా అవుతారు. కొందరు ఏదో విధంగా విడుదల డేట్ కు వస్తారు. మరి కొందరు వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు. ఆఖరికి ఈమధ్య ఫస్ట్ లుక్ లు, టీజర్ లు ఇలాంటివి కూడా లేటు చేస్తున్నారు. ఫలానా రోజు టీజర్ లేదా లుక్ ఇస్తామని మళ్లీ ఆ టైమ్ కు టెన్షన్ పడుతున్నారు.

నిన్నటికి నిన్న మహానటి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ మధ్యాహ్నం మూడు గంటలకు చేస్తామని ఆఖరికి ఆరు గంటల తరుహత కానీ చేయలేకపోయారు.

అజ్ఞాతవాసి సెకండ్ సాంగ్ 12న విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవానికి దాన్ని 10 లేదా 11న విడుదల చేద్దాం అనుకున్నారని వినికిడి. కానీ వర్క్ ఫినిష్ కాక వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రంగస్థలం సినిమాది డిఫరెంట్ రూటు. ఆ సినిమా ఆది నుంచీ లేటుగానే నడుస్తోంది. ఎప్పుడొ దసరాకు రావాల్సిన సినిమా వచ్చే సమ్మర్ కు వస్తుందంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే డజన్ల కొద్దీ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఎవరు పడితే వారు లొకేషన్ సెట్ కు వెళ్లి ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేసారు. ఇప్పుడు ఓ పోస్టర్ విడుదలకు రెండు రోజుల ముందు డేట్ ప్రకటించి, మళ్లీ మరో రోజుకు వాయిదా వేసారు. దర్శకుడు సుకుమార్ అంటేనే వాయిదాల పర్వం అన్నట్లు తయారయింది.

అసలు ఈ మధ్య మార్చి 29 నుంచి మే కు వెళ్లిపోతుంది రంగస్థలం అన్న గుసగుసలు వినిపించాయి. వాటిని కట్ చేయడానికే ఈ లుక్ పోస్టర్ అన్నది విడుదల చేయాలనుకున్నట్లు వినికిడి. కానీ అది కూడా కాస్త ఆలస్యం.