Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫ్లాప్‌ సినిమాపై పడ్డ రామ్‌ చరణ్‌?

ఫ్లాప్‌ సినిమాపై పడ్డ రామ్‌ చరణ్‌?

రామ్‌ చరణ్‌తో శ్రీను వైట్ల తీసే చిత్రం యాక్షన్‌ ప్రధానంగా ఉంటుందనే న్యూస్‌ రీసెంట్‌గా బయటకి వచ్చింది. ఈ చిత్రం కోసం చరణ్‌ పర్సనల్‌ ట్రెయినర్‌ని పెట్టుకోవడంతో ఈ చిత్రంలో యాక్షన్‌ పార్ట్‌ ఎంత ఇంపార్టెంట్‌ అనేది అర్థమైంది. అయితే కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ సినిమాలు తీసే శ్రీను వైట్ల ఇప్పుడు పంథా ఎందుకు మార్చుకున్నాడో మరి. 

ఇదిలావుంటే ఈ చిత్రం స్టోరీ లైన్‌ చిరంజీవి నటించిన ‘మరణ మృదంగం’ చిత్రానికి దగ్గరగా ఉందని వినిపిస్తోంది. చరణ్‌ చేయాలంటే చిరంజీవి నటించిన హిట్‌ సినిమాలే ఎన్నో ఉండగా... ఏరి కోరి ఈ ఫ్లాప్‌ సినిమా లైన్‌పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాడో?     

చరణ్‌ సినిమాలకి అండర్‌ ప్రొడక్షన్‌లో ఉండగా లో హైప్‌ ఉండడం మామూలే. కాకపోతే శ్రీను వైట్ల సినిమాకి మాత్రం క్రేజ్‌ బాగా వస్తుందని అనుకున్నారు. కానీ యాక్షన్‌ సినిమా అని, మరణ మృదంగంకి దగ్గరగా ఉంటుందనే వార్తలు దీనిపై ఆసక్తి తగ్గేట్టు చేస్తున్నాయి. శ్రీను వైట్ల ఇంకా ఈ వార్తని ఖరారు చేయడం కానీ ఖండించడం కానీ చేయలేదు కాబట్టి ఇప్పుడే దీని విషయంలో కంగారక్కర్లేదులెండి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?