Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గబ్బర్ కు ప్రచారం కోసం...

గబ్బర్ కు ప్రచారం కోసం...

సర్దార్ గబ్బర్ సింగ్ ఎప్పటి నుంచో వార్తల్లో నాని నాని, ఆఖరికి ప్రారంభమైంది. ఆ తరువాత కూడా ఏ పొజిషన్ లో వుంది అన్నది పెద్దగా బయటకు రావడం లేదు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం లేదు అనుకున్నపుడు, స్పష్టమైన కారణం జనాల్లోకి పంపడం కోసం మాత్రం తెగ చిత్రాలు వదిలారు. అయితే ఇటీవల దర్శకుడు బాబి, ముఖ్యంగా నిర్మాత శరద్ మురార్ మాత్రం, సినిమా ప్రచారాన్ని లైవ్ లో వుంచాలని తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది. 

నిజానికి పవన్ అయితే తన సినిమా ప్రొడక్షన్ అంతా సైలెంట్ గా నడిచిపోవాలనుకుంటారు. కానీ ఎంత పవన్ సినిమా అయినా నిర్మాతగా దానికి గ్రాడ్యువల్ గా హైప్ తీసుకురావలని అనుకోవడం సహజం. ఇప్పుడు అందుకే తరచు శరద్ మురార్ అదే చేస్తున్నారు. అప్ డేట్స్ ట్వీట్ చేయడం, సినిమా ఫోటోలు వదులుతుండడం తరచు చేస్తున్నారు. 

ఇటీవల కాజల్, పవన్ కలిసిన ఫొటోను అలాగే ముందు లీక్ చేసారు. ఆపై విడుదల చేసారు. అంటే సినిమా షూటింగ్ ఎక్కడా ఆగలేదు..నడుస్తోంది..టైమ్ కు వస్తుంది అన్న సందేశాన్ని ఇండస్ట్రీలోకి, ప్రేక్షకుల్లోకి పంపాలని తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?