Home > Movies - Movie Gossip
‘గది’లో ఇద్దరే హీరోయిన్లు

ఓంకార్ లాంటి చిన్న డైరక్టర్ తో అగ్రనటుడు నాగార్జున చేస్తున్న సినిమా రాజుగారి గది 2. నిజానికి రాజుగారి గది సినిమాకు దీనికి ఏమీ సంబంధం లేకపోయినా, మళయాల సినిమాకు రీమేక్ అయినా ఆ పేరుకు వున్న క్రేజ్ ను దృష్టిలో వుంచుకుని ఆ పేరే ఫిక్స్ చేసారు.

ఈ సినిమాలో సమంత, రిచా పనాయ్ లను హీరోయిన్ లుగా ఫిక్స్ చేసారు. ఆ తరువాత మరో మూడో హీరోయిన్ ను కూడా తీసుకుంటారని ఆది నుంచీ అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఇక మూడో హీరోయిన్ వుందన్నది. అంటే వుండదు అని కాదు. ప్రామినెంట్ హీరోయిన్ ఎవర్నీ తీసుకోవడం లేదు. ఆ మూడో హీరోయిన్ పాత్ర మరీ అంత ప్రాధాన్యత వున్నది కాదని, అందువల్ల దానికోసం మళ్లీ మరో హీరోయిన్ అనవసరం అని యూనిట్ డిసైడ్ అయిందట. అందువల్ల ఈ పాత్రకు జస్ట్ ఓ చిన్న నటిని తీసుకుంటున్నారట. ఈ సినిమాలో నాగ్ ది ఓ స్పెషల్ రోల్.