Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గంగతో దాగుడు మూతలు?

గంగతో దాగుడు మూతలు?

దాగుడు మూతల దండాకోర్ సినిమాకు ఇంకా మోక్షం వచ్చేటట్లు కనిపించడం లేదు. ఎప్పుడో రెడీ అయిపోయింది ఆ సినిమా. ఎనుబోతుల మధ్యకు లేగదూడను పంపినట్లు వుంటదని, అలా వెనక్కు వెనక్కు వెళ్తున్నారు. ఆఖరికి మే 1 న విడుదల చేయాలని అనుకున్నారు. 

ఇప్పుడు దీనిపై కూడా ముందు వెనుకలు ఆడుతున్నారని వినికిడి. దీనికి అసలు కారణం గంగ సినిమా. గంగ ను నైజాం కు, దాగుడుమూతల సినిమాను ఎపి తెలంగాణకు కొన్నది దిల్ రాజే. 

రెండూ తన సినిమాలే కావడంతో ఒకసారి విడుదల వద్దని అంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీటింగ్ ల మీటింగ్ లు నడుస్తున్నాయి. ఏ విషయం మంగళవారం తెలిసే అవకాశం, వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?