Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గంటా కొడుకు టెస్ట్ షూటింగ్?

మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్న వైనంపై గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరక్ట్ చేసే అవకాశం వుందనీ వార్తలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గంటా తనయుడు రవితేజపై విశాఖలో టెస్ట్ షూట్ ప్రారంభమైందని బోగట్టా. అసలు తెరపై ఎలా వుంటాడు..డైలాగ్..ఎక్స్ ప్రెషన్..డ్యాన్స్..ఫైట్ ఇలా ఎలా వుంటాయి అనేది తెలుసుకునేందుకు ఓ కొత్త దర్శకుడి చేత టెస్ట్ షూట్ చేయిస్తున్నట్లు వినికిడి. అది చూసి, అతనికి ఏ సబ్జెక్ట్ పనికి వస్తుంది, ఏ టైపు క్యారెక్టర్లు పనికి వస్తాయి అన్నది డిసైడ్ చేసే అవకాశం వుంది. ఈ టెస్ట్ షూట్ వ్యవహారంలో మాత్రం దర్శకుడు మారుతి ప్రమేయం లేకుండా వాళ్లే చేసుకుంటున్నారని వినికిడి. తొందరపడి ఏదో ఒకటి చేసేయకుండా, బాగుండేలా చేయాలని, మంత్రి గంటా, ఈ టెస్ట్ షూట్ ఏర్పాటు చేసినట్లు వినికిడి.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?