Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చాలా కథలు వస్తున్నాయి.. అమలాపాల్ కోతలు

చాలా కథలు వస్తున్నాయి.. అమలాపాల్ కోతలు

అవకాశాలు రావట్లేదని ఒప్పుకోవడం ఒకెత్తు. మంచి కథలు దొరకడం లేదని గొప్పలు చెప్పుకోవడం మరో ఎత్తు. లెక్కలేనన్ని ఆఫర్లు వస్తున్నాయని డప్పు కొట్టుకోవడం అన్నింటికీ మించిన ఎత్తు. ఇలా ఎవరికీ అందని ఎత్తు వేసింది అమలాపాల్. టాలీవుడ్ నుంచి తనకు లెక్కలేనన్ని ఆఫర్లు వస్తున్నాయని, కానీ ఏదీ ఫైనలైజ్ చేయలేదని చెబుతోంది ఈ చిన్నది. 

నిజానికి అమలాపాల్ కు అంత సీన్ లేదు. భర్త విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనకున్న పరిచయాలతో తమిళ్ లో మాత్రం ఒకట్రెండు సినిమా ఆఫర్లు అందుకుంది. అంతా ఊహించినట్టే ధనుష్ పిలిచిమరీ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. కానీ తెలుగులో మాత్రం ఆమెను పట్టించుకునే నాథుడు లేడు. 

ఆ విషయాన్ని అమలాపాల్ ఒప్పుకోవడం లేదు. మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పుంటే ఆ లెక్క వేరు. చాలా స్టోరీలు వస్తున్నాయి కానీ నేనే ఒప్పుకోవడం లేదని చెప్పడం మాత్రం అతి. టాలీవుడ్ లో మొదట్నుంచి అమలాపాల్ కు అవకాశాలు తక్కువే. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ కు కోలీవుడ్ నుంచి కూడా ఛాన్స్ లు రాకపోవడంతో ఇప్పుడు మలయాళం వైపు మళ్లింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?