Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఘోరాతి ఘోరమైన ఫ్లాప్‌

ఘోరాతి ఘోరమైన ఫ్లాప్‌

‘ఐస్‌క్రీమ్‌’ చిత్రం సక్సెస్‌ అయిందని చెప్పుకుని దానికి సీక్వెల్‌ కూడా తీసిన రామ్‌ గోపాల్‌ వర్మకి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ‘ఐస్‌క్రీమ్‌ 2’ చిత్రం ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఘోరమైన ఫ్లాప్‌గా రికార్డు సృష్టించింది. పేరున్న దర్శకులు తీసిన సినిమాల్లో ఈ చిత్రానికి జరిగిన పరాభవం ఇటీవల దేనికీ జరగలేదు. అసలెప్పుడైనా ఇంత ఘోరమైన ఫ్లాప్‌ వచ్చిందో లేదో కూడా తెలీదు. 

రెండే రెండు రోజుల్లో ఈ చిత్రాన్ని చాలా థియేటర్ల నుంచి తొలగించారు. మామూలుగా కొత్త సినిమాల్ని ఆదివారం వరకు అయినా ఆడిరచాలని అనుకుంటారు. ఆదివారం కలెక్షన్స్‌ బాగా వస్తాయి కనుక ఎంతో కొంత వసూలవుతుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. కానీ ‘ఐస్‌క్రీమ్‌ 2’ చిత్రాన్ని మరో రోజు థియేటర్లలో ఉంచడం కూడా నేరమే అన్నట్టుగా తీసి పడేసారు. 

ప్రతి షోకి వందల్లో వస్తున్న గ్రాస్‌ కలెక్షన్లు చూసి ఎగ్జిబిటర్లు బెంబేలెత్తిపోయి దీన్ని తీసేసి పాత సినిమాలు వేసుకున్నారు. వారం రోజుల పాటు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే అంతే సంగతులు అనుకున్నారో ఏమో మరి. ఇదిలావుంటే ఐస్‌క్రీమ్‌ 2 గురించి అస్సలు పట్టించుకోకుండా వర్మ తన నెక్స్‌ట్‌ సినిమాతో ‘స్పాట్‌’ పెడతానంటున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?