Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరోసారి విలన్ గా మారబోతున్నాడు

మరోసారి విలన్ గా మారబోతున్నాడు

మంచి క్యారెక్టర్ దొరికితే విలన్ గా కూడా చేయడానికి సిద్ధమని రాజశేఖర్, మంచు మనోజ్, గోపీచంద్, సునీల్ లాంటి నటులు చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు వీళ్లలో గోపీచంద్ ముందుగా ఆ పని చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బోయపాటి దర్శకత్వంలో ప్రతినాయకుడిగా మెరవబోతున్నాడు గోపీచంద్. 

బోయపాటి, మహేష్ కాంబినేషన్ సెట్ అయింది. ఇది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయంపై క్లారిటీ లేకపోయినా, అందులో విలన్ గా మాత్రం గోపీచంద్ ను తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు బోయపాటి, గోపీచంద్ మధ్య చిన్నపాటి డిస్కషన్ కూడా నడిచింది. 

గోపీచంద్ కు విలన్ వేషాలు కొత్తకాదు. విలన్ గా క్లిక్ అయిన తర్వాతే హీరోగా సినిమాలు కొనసాగించాడు. వర్షం, నిజం, జయం సినిమాల్లో గోపీచంద్ విలనీని మరిచిపోలేం. ఆ తర్వాత పూర్తిగా ప్రతినాయకుడి వేషాలకు దూరమయ్యాడు గోపీచంద్. మళ్లీ ఇన్నేళ్లకు బోయపాటి దర్శకత్వంలో మహేష్ సినిమా కోసం మరోసారి విలన్ గా మారుతున్నాడు.

అటు బోయపాటికి కూడా విలన్లను కొత్తగా ప్రజెంట్ చేయడం ఇష్టం. జగపతిబాబు లాంటి సీనియర్ హీరోను విలన్ గా మార్చేసిన ఘనత బోయపాటిదే. ఇప్పుడు గోపీచంద్ ను కూడా అలానే మార్చబోతున్నాడట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?