Advertisement


Home > Movies - Movie Gossip
గోపీచంద్ పంతం వీడి శపథం

ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తూ వస్తున్న హీరో గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో మాంచి స్క్రిప్ట్ తెచ్చిన కొత్త డైరక్టర్ చక్రిని పట్టుకున్నాడు. సీనియర్ నిర్మాత రాధామోహన్ కేకే ఈ ప్రాజెక్టును టేకప్ చేసారు.

ఈ సినిమాకు పంతం అనే టైటిల్ పెడదామని ఆ మధ్య అనుకున్నారు. కానీ ఆ టైటిల్ అంత బాగా లేదని యూనిట్ ఫీలయింది. అదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లాగా వుందని అనుకున్నారు. కానీ హీరో గోపీచంద్ కు సున్నాతో అంతమయ్యే పదం టైటిల్ గా కావాలని కోరిక. అది ఆయన సెంటిమెంట్.

ఆఖరికి ఇప్పుడు తాజగా శపథం అనే టైటిల్ లైన్లో కి వచ్చింది. ఈ టైటిల్ ఎలా వుందని డిస్కషన్ చేస్తున్నారు. దాదాపు అందరూ ఇది ఓకె అనే అంటున్నారట. దాంతో ఇదే టైటిల్ గా ఫిక్సయ్యే అవకాశం వుంది.

ఈ సినిమా మీద గోపీచంద్ చాలా ఆశతో వున్నాడు. కాస్త కొత్త సబ్జెక్ట్, కొత్త డైరక్టర్, ఈ సినిమా హిట్ అయితే మళ్లీ లైనప్ సెట్ అవుతుంది. అందుకే అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రస్తుతానికి యాభై శాతం పూర్తయిందీ సినిమా.