Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గ్యాసిప్ లకు తెరవేసిన ట్రయిలర్

గ్యాసిప్ లకు తెరవేసిన ట్రయిలర్

గడచిన రెండు నెలలుగా డైరక్టర్ బివిఎస్ రవికి మనసు మనసులో లేదు. జవాన్ సినిమా మీద వస్తున్న గ్యాసిప్ లు చూసి తెగ కలవరపడ్డాడు. ఈ సినిమా అతగాడి లైఫ్ అండ్ డెత్ సమస్య. అలాంటి సినిమా క్వాలిటీపై వస్తున్న గ్యాసిప్ లకు కిందామీదా అయ్యాడు.

అలాంటి టైమ్ లో నిర్మాత కృష్ణ, దిల్ రాజే పెద్ద సపోర్ట్ గా నిల్చున్నారట. అయినా టెన్షన్లు తీరలేదు. ఆడియో ఫంక్షన్ నాటికి ట్రయిలర్ రెడీ కాలేదు. రెండు రోజులు ఆలస్యంగా ట్రయిలర్ కు డేట్ పెట్టారు.

తీరా చేస్తే, చెన్నయ్ లో ట్రయిలర్ రెడీ అవుతున్న ల్యాబ్ లో సమస్య వచ్చింది. రీరికార్డింగ్, మిక్సింగ్ మళ్లీ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ 9కి విడుదల చేద్దామనుకుంటే, తెల్లవారు ఝామున 5కు రెడీ అయింది. దీంతో బుధవారం రాత్రి అంతా చెన్నయ్ లోని ల్యాబ్ లో నిద్రలేని రాత్రి గడిపాడట. 

ఆఖరికి ట్రయిలర్ విడుదల చేసిన తరువాత ఇండస్ట్రీ నుంచి, మీడియా నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసిన తరువాత హమ్మయ్య.. అనుకున్నాడట. బివిఎస్ రవి ఈసారి సాయిధరమ్ తో ఇటు ఫ్యామిలీ, అటు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ కలగలిసిన సబ్జెక్ట్ చేస్తున్నాడని ట్రయిలర్ తో క్లియర్ అయింది. ట్రయిలర్ ప్రామిసింగ్ గా వుందని ఇండస్ట్రీలోని వెల్ విషర్లు చెప్పడంతో బివిఎస్ రవి మొన్నటి దాకా వినవచ్చిన గ్యాసిప్ లు అన్నీ మరిచి ఫుల్ ఖుషీ అయ్యాడట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?