Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గౌతమ్ నందా కాస్త ఆలస్యం?

గౌతమ్ నందా కాస్త ఆలస్యం?

గౌతమ్ నందా అన్ని విధాలా రెడీ అయిపోతోంది. జూలై 14న విడుదల అని ఇప్పటి వరకు వినిపిస్తున్న విషయం. అయితే వన్ వీక్ వెనక్కు వెళ్లే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

యూనిట్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో ఫుల్ బిజీగా వుంది. రీ రికార్డింగ్ కార్యక్రమాలు చెన్నయ్ లో చకచకా జరుగుతున్నాయి.

అయితే అంతా కలిపి మూడు వారాల సమయం వుంది. అందులో చివరి వారం అంతా క్యూబ్ లు, సెన్సార్ లు, ఇతర వ్యవహారాలకే సరిపోతుంది. అందువల్ల మిగిలింది రెండు వారాలు.

ఈ రెండు వారాల్లో సినిమా పూర్తి కావడం, ప్రమోషన్లు వంటివి చేసుకోవాలి. ఎలాగూ జూలై మూడో వారం, నాలుగో వారం సరైన సినిమాలు లేవు. అందువల్ల వన్ వీక్ వెనక్కు వెళ్లినా నష్టం లేదన్న ఆలోచన కూడా గౌతమ్ నందా యూనిట్ లో  వుందని టాక్ వినిపిస్తోంది.

సంపత్ నంది దర్శకత్వం వహించిన గౌతమ్ నందాకు ఇటీవల మాంచి బజ్ వచ్చింది. విడుదల చేసిన స్టిల్స్, టీజర్లు, అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలైలో విడుదలయ్యే సినిమాల్లో కాస్త క్రేజ్ వున్న ప్రాజెక్టుల్లో గౌతమ్ నందా ఒకటి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?