Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గౌతమీ పుత్రుడి రెమ్యూనరేషన్ ఎంత?

గౌతమీ పుత్రుడి  రెమ్యూనరేషన్ ఎంత?

టాలీవుడ్ లో రెమ్యూనిరేషన్ అన్నదే హీరోల డిమాండ్ కు కొలమానం. మహేష్ తరువాతి సినిమాకు పాతిక కోట్లు అన్నది ఆ డిమాండ్ బట్టే. పవన్ కాటమరాయడు, చిరు ఖైదీ నెంబర్ 150 లు వారి వారి స్వంత బ్యానర్లు. లెక్కల్లో రెమ్యూనిరేషన్ చూపిస్తారు. వైట్ లోనూ వుంటుంది. బ్లాక్ లోనూ వుంటుంది కానీ, ఎంతన్నది గుసగుసలకు కూడా అందదు. ఇక మిగిలింది బాలయ్య వందో సినిమా సంగతే. ఈ సినిమా ప్రెస్టీజియస్ మూవీ. పైగా చారిత్రాత్మక సినిమా. ఈ పాత్రకు బాలయ్య తప్ప మరొకరు సూట్ కారు. అది. వాస్తవం.

మరి అలాంటి సినిమాకు బాలయ్య ఎంత తీసుకుంటున్నట్లు? ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాకు ఆరున్నర కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆరున్నర కోట్లు నేరుగానే తప్ప, మళ్లీ హక్కులు, వాటాలు ఇలాంటివి ఏవీ లేవని వినికిడి. సీడెడ్ లేదా నైజాం హక్కుల వంటి వాటి జోలికి బాలయ్య వెళ్లలేదట. ఆ తలకాయనొప్పులు తనకు వద్దని నిర్మాతలకు స్ఫష్టం చేసేసినట్లు తెలిసింది. 

నాగ్, వెంకీ లాంటి సీనియర్ హీరోలు అయిదు కోట్ల దగ్గర వున్నారు పారితోషిక విషయంలో మరి బాలయ్య ఆరున్నర అంటే, కాస్త గట్టిగానే ముట్టినట్లు అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?