Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హారిక హాసిని మరో కంపెనీ

హారిక హాసిని మరో కంపెనీ

హారిక హాసిని అంటూ రెండు సినిమాలు త్రివిక్రమ్ డైరక్షన్లో నిర్మించారు. మళ్లీ మూడోది మహేష్ కోసం రిజర్వ్ చేసారు. ఈ లోగా నాగచైతన్యతో ఇంకో సినిమా ప్లాన్ చేసారు. అయితే దీనికి హారిక హాసిని బ్యానర్ ను మాత్రం వాడరట. ఆ బ్యానర్ కేవలం త్రివిక్రమ్ డైరక్షన్ కే పరిమితం అంట. 

నాగచైతన్య సినిమాకు చందు మొండేటి దర్శకుడు. అందుకని వేరే బ్యానర్ ప్రారంభిస్తారట. త్వరలో ఈ బ్యానర్, కార్యాలయం ప్రారంభించి, త్వరలో సినిమాకు కొబ్బరి కాయ కొడతారంట. 

ఈ సినిమా పూర్తవ్వాలి..మరో పక్క మహేష్ బ్రహ్మోత్సవం పూర్తి కావాలి. అప్పుడు హారిక హాసిని-త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ మొదలవుతుంది. అంటే కనీసం ఏడాది పైనే పడుతుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?