Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హరీష్ కు బూతులంటే అంతిష్టమా?

హరీష్ కు బూతులంటే అంతిష్టమా?

సినిమా జనాలకేమిటి? మామూలుగా చాలా మందికి బూతులు లేదా డబుల్ మీనింగ్ డైలాగులు చకచకా మాట్లాడేయడం అంటే మహా హుషారు. పనిలో అలుపు తెలియకుండా మాటలతో ఇలా ఎంజాయ్ చేసేస్తుంటారు.

డిజె సినిమాలోని పాటల్లో అగ్రహారాల తమలపాకు లాంటి పదాలు అలాంటి అర్థాలు ఇస్తాయని ఆ మధ్య బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం కూడా చెప్పాయి. అయినా ఆ పదం తొలగించలేదు. అది వేరే సంగతి.

అయితే పాటల సంగతి పక్కన పెడితే సినిమాలో బ్రాహ్మణ పాత్రల నోట మూడు డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించేసాడు దర్శకుడు హరీష్ శంకర్. ‘..నేను కాలికి సాక్స్ లే వేసుకోను.. ఇంక..’ అంటూ కండోమ్ వాడకాన్ని గుర్తుకు తెచ్చే డైలాగు ఒకటి వుంది.

అలాగే ‘..వెనకటికి వెంకాయమ్మ వంగలేక, మంగళవారం అందట’ అంటూ ఓ బూతు సామెతను గుర్తు చేసాడు. అలాగే ఓ సీన్ లో హీరో ‘..ఎన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా చేత్తో సెల్ఫీలు తీసుకుంటాను..వేళ్లు నొప్పెట్టేలా..’ అంటాడు.

అదుర్స్ డైరక్టర్ వినాయక్ బ్రాహ్మిన్ కాదు. కానీ హీరో క్యారెక్టర్ నోట ఒక్క బూతు మాట చెప్పించలేదు. కానీ నేను బ్రాహ్మణడును, అంటూ ప్రవర చెబుతూ యూ ట్యూబ్ విడియో వదిలిన హరీష్ శంకర్ మాత్రం బ్రాహ్మిన్ క్యారెక్టర్ల చేత ఇలా బూతులు మాట్లాడించేసాడు.

ఇదిలా వుంటే, హరీష్ శంకర్ కు బూతులు, డబుల్ మీనింగ్ లు అలా అలా నోటి వెంట వస్తుంటాయని డిజె సినిమా షూట్ సందర్భంగా అతనితో పని చేసిన వారు చెబుతున్నారు.

డిజె షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ముచ్చట కూడా యూనిట్ జనాల గుసగుసల్లో వినిపిస్తోంది. అదేంటంటే, డిజె షూటింగ్ సందర్భంగా ఓ ఫేమస్ టెంపుల్ లో షూట్ కు వెళ్లారట.

అక్కడ జోళ్లు తీసేసి, గుడిలోకి వెళ్తూనే, హరీష్ శంకర్ చటుక్కున ఓ డైలాగ్ విసిరారట. గుళ్లోకి వచ్చానని, బూతులు మానేస్తారనుకున్నారేమో? వాటి దారి వాటిదే అంటూ మచ్చుకి ఓ డైలాగ్ వదిలారట. దాంతో యూనిట్ జనాలు పడీ పడీ నవ్వారని తెలుస్తోంది.

ఈ గుసగుసలు బట్టి తెలుస్తోంది ఏమిటంటే, హరీష్ కు సహజంగా ఈ టైపు డైలాగులు అంటే ఇష్టం అని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?