Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హరీష్-ఎన్టీఆర్ పొగడ్తలు అందుకేనా?

హరీష్-ఎన్టీఆర్ పొగడ్తలు అందుకేనా?

రాక రాక పెద్ద సినిమా చేతిలోకి రావడానికి ఏళ్లు పట్టింది దర్శకుడు హరీష్ శంకర్ కు. బన్నీకి గ్యాప్ రావడమో, టైమ్ కు మరెవరు సెట్ కాకపోవడమో, దిల్ రాజు అండ వుండడమో, మరోటో మొత్తానికి డిజె సినిమా చేతిలోకి వచ్చింది. అలాంటి హరీష్ శంకర్ మరో హీరో ఎన్టీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తడం బన్నీ ఫ్యాన్స్ కు మండిస్తోంది.

ఎన్టీఆన్ ఒక్కరే సింగిల్ టేక్ హీరో అంటూ హరీష్ పొగిడేసాడు. సింగిల్ టేక్ హీరో అని అనడం వరకు ఓకె. ఎన్టీఆర్ ఒక్కడే అంటే మరి బన్నీ సంగతేమిటి? అన్నది ఆయన ఫ్యాన్స్ ప్రశ్న. ఇది రచ్చ అవుతుంటే, ఇలా కాదు అని, విషయాన్ని డైల్యూట్ చేయడానికా అన్నట్లు, జై లవకుశ డైరక్టర్ బాబీ చేత కూడా అదే ముక్క అనిపించేసారు.

అయితే ఇంతకీ టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, ఎన్టీఆర్ ఓ సినిమాను నిర్మాత బోగవిల్లి ప్రసాద్ కు చేయడానికి సుముఖంగా వున్నారట. నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమా నిర్మించింది ఆయనే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వుంది. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా వుంది. వీటిని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. బోగవిల్లి ప్రసాద్ సినిమాకు డైరక్టర్ ఫిక్స్ కాలేదు. ఆ సినిమా హరీష్ కు ఇస్తానని ఎన్టీఆర్ జస్ట్ మాట ఇచ్చినట్లు వినిపిస్తోంది. అందుకే అది పక్కా చేసుకోవడానికే హరీష్ ఈ పొగడ్తల పోగ్రామ్ పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?