Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హేమ కెందుకో పర్సనల్ మ్యాటర్

హేమ కెందుకో పర్సనల్ మ్యాటర్

ఎన్నికలు అన్నాక కాస్తయినా కనస్ట్రక్టివ్ క్రిటిసిజమ్ వుండాలి. అంతే కానీ బిలో ది బెల్ట్ వ్యవహారం వుండకూడదు. కానీ మా ఎన్నికలు ఈ హద్దును దాటుతున్నట్లు కనిపిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ లో వున్న శివాజీ రాజా  మీద లేడీ కమెడియన్ హేమ కాస్త ఘాటు కామెంట్ చేసింది.

 ''ఆయను ముందు అమ్మానాన్నల‌కు అన్నం పెట్టమనండి..అంతే కానీ, అది చేయకుండా కళాకారులు..సొసైటీ..సేవ సంగతి తరువాత..' అనేసింది హేమ. ఆ మధ్య కిరణ్ కుమార్ రెడ్డి పార్టీతరపున పనిచేసి, రాజకీయాలు బాగానే వంట బట్టినట్లున్నాయి హేమకు. 

పనిలో పనిగా నాగబాబుపై కూడా కామెంట్ పడేసింది. ఆయన సారథ్యంలోగతంలో పనికిరాని సైట్ ను మా కోసం బోలెడు డబ్బుపోసి కొన్నారని, దాని రేటు తరువాత ఢమాల్ అందని చెప్పింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?