Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ సోమ్ము గుల్లయిపోతోంది

హీరోయిన్ లు కష్టపడి సినిమాలు చేయడం, బోలెడు డబ్బులు సంపాదించడం, ఆఫై ఎవరో ఒక హీరోనో, మరో సెకెండ్ హ్యాండ్ వ్యక్తినో చూసి పెళ్లి చేసుకోవడం మామూలే. ఆ సంపాదన అంతా అతగాడి చేతిలో పడి హుష్ కాకి అయిపోవడం అలనాటి సావిత్రి నుంచి నిన్న మొన్నటి భూమిక దాకా అందరి వైనాలు చెప్పే నిజం. 

తాజగా ఓ టాప్ హీరోయిన్ పరిస్థితి కూడా ఇలాగే వుందట. పైకి చెప్పకున్నా పెళ్లి చేసుకుని, చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తూ, వార్తలకు పదే పదే ఎక్కుతున్న ఈ హీరోయిన్ బాగానే సంపాదించింది. అయితే ఆ సదరు భర్తలాంటి భర్తగారు ఆ సొమ్ము బాగానే ఖర్చు చేయిస్తున్నారని టాక్. 

ఇప్పటికే ఓ పది కోట్లు వరకు ఓ సినిమాకు పెట్టుబడి కూడా పెట్టించేసాడని,. అవి కాస్తా ఫట్ అయిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరేం చేయగలరు..ఎవరి మోజు వారిది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?