Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇటు హాలిడే ట్రిప్.. అటు హనీమూన్

ఇటు హాలిడే ట్రిప్.. అటు హనీమూన్

అక్కినేని కాంపౌండ్ లో ఒకేసారి రిలాక్స్ మూడ్ స్టార్ట్ అయింది. ఇటు నాగార్జున, అటు నాగచైతన్య ఒకేసారి టూర్స్ ప్లాన్ చేశారు.  అమలతో కలిసి నాగార్జున హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తే.. భార్య సమంతతో కలిసి నాగచైతన్య చిన్నపాటి హనీమూన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే అమలతో కలిసి ఎటైనా వెళ్లిరావడం నాగ్ కు అలవాటు. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. రాజుగారి గది-2 సినిమాకు సంబంధించి ప్రచార పర్వం పూర్తిచేసిన నాగార్జున, అమలతో కలిసి ఓ టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లాలనుకుంటున్నాడు. 

అటు నాగచైతన్య మాత్రం సమంతతో కలిసి న్యూజిలాండ్ లో హనీమూన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రంగస్థలం సినిమాకు సంబంధించి  కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకొని, వారంరోజుల పాటు న్యూజిలాండ్ లోని ఓ దీవికి హనీమూన్ వెళ్లిరావాలని నాగచైతన్య ప్లాన్ చేస్తున్నాడట. ఈ రెండుటూర్లు కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఉండే ఛాన్స్ ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?