Advertisement


Home > Movies - Movie Gossip
మహేష్ మూవీలో వెరీ స్పెషల్ ఫైట్

మిర్చిలో వాన ఫైట్.. 
శ్రీమంతుడులో మామిడి తోపు ఫైట్..
జనతా గ్యారేజ్ లో గవర్నమెంట్ ఆఫీస్ ఫైట్..

ఇలా కొరటాల శివ తీసిన ప్రతి సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవుతుంది. మరి నెక్ట్స్ సినిమా సంగతేంటి..? ప్రస్తుతం మహేష్ తో తీస్తున్న భరత్ అనే నేను సినిమాలో కూడా ఇలాంటిదే ఓ స్పెషల్ ఫైట్ ఉంది. అదే హోలీ ఫైట్.

అవును.. మహేష్, కొరటాల సినిమాలో హోలీ బ్యాక్ డ్రాప్ లో ఓ ఫైట్ ఉంది. టోటల్ సినిమాకే ఆ ఫైట్ హైలెట్ గా నిలుస్తుందని టాక్. ఈ ఎపిసోడ్ ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడట కొరటాల. ఈమధ్యే ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ కంప్లీట్ అయిన తర్వాతే వేరే పనిమీద అమెరికా వెళ్లాడు మహేష్. 

భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు మహేష్. ఓవైపు ఉన్నతమైన పదవిలో కొనసాగుతూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈనెల 26 నుంచి ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ పొలాచ్చిలో ప్రారంభం అవుతుంది.