Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదే రైట్‌ టైమ్‌ ‘రాజా’

ఇదే రైట్‌ టైమ్‌ ‘రాజా’

హీరోగా పరిచయమై చాలా కాలమవుతున్నా కానీ ఇంతవరకు శర్వానంద్‌కి సరైన బ్రేక్‌ రాలేదు. గమ్యం, జర్నీలాంటి విజయాలు ఉన్నా కానీ శర్వానంద్‌కి రావాల్సిన గుర్తింపు రాలేదు. చాలా మంది హీరోల కంటే టాలెంటెడ్‌ అయినా కానీ శర్వానంద్‌ని దురదృష్టం వెంటాడింది. దాదాపు ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్‌ అయిపోయిన దశలో అతని కెరీర్‌లోకి కలర్‌ వచ్చింది. 

అతను నటించిన ‘రన్‌ రాజా రన్‌’ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం ఆకర్షణీయంగా ఉంది. ఆడియో ఆకట్టుకోగా, పబ్లిసిటీ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చూడగానే ఈ సినిమా బాగుంటుందేమో అనే ఫీల్‌ కలిగిస్తోంది. దానికి తగ్గట్టే ఇండస్ట్రీలో దీనికి వినిపిస్తోన్న రిపోర్ట్‌ కూడా పాజిటివ్‌గా ఉంది. 

హిట్‌ సాధించి హీరోగా ఒక ముద్ర వేసేయడానికి శర్వానంద్‌కి ఇదే రైట్‌ టైమ్‌. ఈసారి మిస్‌ అయితే మళ్లీ ఇలాంటి ఆకర్షణలున్న సినిమా అతనికి ఎప్పటికి వస్తుందో కూడా చెప్పలేం. మరి ఈ రాజాకి బాక్సాఫీస్‌ వద్ద ఏమాత్రం రన్‌ వస్తుందో చూద్దాం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?