Advertisement


Home > Movies - Movie Gossip
ఇది కదా మోహన్ బాబు

సీనియర్ హీరో మోహన్ బాబు అంటే ఓ విలక్షణ నటుడు. సరైన పాత్ర పడితే పరకాయ ప్రవేశం చేయగల సామర్థ్యం వున్నవాడు. కానీ ఆయనకు సరైన పాత్రలే కరువైపోయాయి.

ఎప్పుడో రాజమౌళి డైరక్షన్ లో యుముడి క్యారెక్టర్ తరువాత సరైన క్యారెక్టర్ సెట్ కాలేదు. ఇన్నాళ్లకి టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. మదన్ డైరక్షన్ లో నాయకుడిగా, ప్రతినాయకుడిగా రెండు పాత్రలు పోషిస్తున్న గాయత్రి టీజర్ బయటకు వదిలారు.

ఈ టీజర్ లో మోహన్ బాబు పూర్తిగా కొత్తగా వున్నారు. ఆయన కోసం డిజైన్ చేసిన గెటప్ లు పూర్తిగా వైవిధ్యంగా, కాస్త క్లాస్ టచ్ తో వున్నాయి. సినిమా కథలో కాస్త విషయం వున్నట్లు టీజర్ చెప్పకనే చెప్పింది.

ఇద్దరు బలమైన వాళ్ల మధ్య పోరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. రామాయణం, భారతం రెండింటిలో మహా సంగ్రామాలకు మూలం ఓ మహిళే. మరి ఈ సినిమా టైటిల్ గాయత్రి అని పెట్టారు కాబట్టి ఇక్కడ సంగ్రామానికి ఆ టైటిల్ క్యారెక్టర్ కు ఏమైనా సంబంధం వుందా అన్నది తెలియాల్సి వుంది.

చివర్న విష్ణు జస్ట్ కనిపించడం అన్నది అలా వుంచితే, మోహన్ బాబు గెటప్ లు, చెప్పిన డైలాగు కలిపి టీజర్ ను ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా తయారుచేసాయి.