Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది మరీ కాస్త ఓవర్ కదా?

ఇది మరీ కాస్త ఓవర్ కదా?

ఎవరి బిడ్డ వారికి ముద్దు..కాదనడానికి లేదు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరని అనే సినిమా తీసారు నిర్మాత లగడపాటి శ్రీధర్ చాలా సిన్సియర్ గా. కలెక్షన్లు ఫరవాలేదనిపించుకునే రేంజ్ లో వున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ చేసిన తరువాత మరింత కలెక్షన్లు పెరిగాయంటున్నారు నిర్మాత,..ఓకె. బాగానే వుంది. 

కానీ అక్కడి నుంచి మరికొంచెం ముందుకు వెళ్లి, గత ఇరవై ఏళ్లలో ఇంత మంచి చిత్రం రాలేదంటున్నారు జనాలు అన్నారు. సర్లే..నిర్మాత కదా ఆ మాత్రం కొంచెం చెప్పాల్సిందే అనుకుంటే, కొందరయితే ఏకంగా 'శంకరాభరణం' తరువాత ఇదే అంటున్నారన్నారు. 

ఇదే..ఇదే మరీ కాస్త ఎగస్ట్రా అనిపించలేదా? కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సినిమాను ప్రమోట్ చేయడానికి లగడపాటి శ్రీధర్ పడుతున్న శ్రమ, తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే, సగంలో కాడి వదిలేసే నిర్మాతలు కాస్త నేర్చుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?