Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది నీలకంఠ 'మాయ'

ఇది నీలకంఠ 'మాయ'

మధుర శ్రీధర్ తొలిసారి నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తూ, దర్శకత్వ బాధ్యతలు వేరేవారికి అప్పగించి చేస్తున్న సినిమా 'మాయ'. చేసిన జోనర్ లో సినిమా చేయడం అలవాటు లేని దర్శకుడు నీలకంఠ చేస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇఎస్ పి అనే సైన్స్ టెర్మినాలజీ ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. నిజానికి ఇప్పుడు థ్రిల్లర్ ల టైమ్ నడుస్తోంది. మాయకు కాస్త ఆ టచ్ కూడా వుంది. 

అయితే ఇలాంటి సైన్స్ టచ్ వున్న సినిమాలను కాస్త అరటి పండు వలచి నట్లు చెప్పాల్సి వుంటుంది. అప్పుడే ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతారు. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా డౌటే. అయితే నీలకంఠ సినిమాను కాస్త జాగ్రత్తగానే డీల్ చేసే దర్శకుడు. అందువల్ల మాయ విషయంలో అటువంటి కన్ఫ్యూజ్ అనే సందేహాలు పెద్దగా అనవసరం. ఎటొచ్చీ బి సి సెంటర్ల ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ పెద్దగా వుండకపోవడం అన్నది కాస్త ఆలోచించాల్సి వుంటుంది. 

అయితే ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకులు కూడా సినిమా విజయంలో కీలక పాత్ర వహిస్తున్నారు. పైగా ఈ సినిమా బడ్జెట్ కాస్త రీజనబుల్ గా మూడు కోట్లు రేంజ్ లోనే వుంది కాబట్టి పెద్దగా రిస్క్ లేదు. శాటిలైట్ ఇంకా కాలేదు. సినిమా ఏ మాత్రం బాగున్న టాక్ వచ్చినా సగం డబ్బులు అక్కడే వస్తాయి. ఇక మిగిలిన సగం ఒకటి రెండు వారాల్లో రాబట్టడం అంత కష్టం కాదు. ఈ సారి మధుర శ్రీ ధర్ సినిమా పబ్లిసిటీ మీద కూడా కాస్త బాగానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. 

ధోతీ డ్యాన్స్ పేరుతో చేసిన ప్రోమో సాంగ్, సినిమాతో పెద్దగా కనెక్ట్ కాకున్నా, యూ ట్యూబ్ లో బాగానే హిట్ లు సంపాదించింది.  పైగా రెండు రోజుల ముందే మీడియాకు సినిమా చూపించే ధైర్యం కూడా చేస్తున్నారు. అంటే సినిమాకు మాంచి రివ్యూలు వస్తే, ఓపెనింగ్స్ కు ప్లస్ అవుతుందనే అయిడియాతో కూడా కావచ్చు. ఈ సినిమా సక్సెస్ పై ఆధారపడి వుంటుంది, మధుర శ్రీధర్ నిర్మాతగా మరిన్ని సినిమాలకు శ్రీకారం చుట్టడం అన్నది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?