Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇక ‘దేశా’నికి ఎన్టీఆర్ దూరమేనా?

ఇక ‘దేశా’నికి ఎన్టీఆర్ దూరమేనా?

మహానాడు గుర్తుకువస్తే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన జయంతినాడు ఏర్పాటు చేసే కార్యక్రమం కదా? అందుకే. అయితే గత రెండు మూడేళ్లుగా మరో ఎన్టీఆర్ కూడా మహానాడు సమయంలో గుర్తుకు వస్తున్నారు.  తెలుగుదేశం జనాలకు కాకపోయినా, మీడియాకు కచ్చితంగా గుర్తుకు వచ్చేవారు. మహానాడుకు ఆహ్వానం అందిందా? వెళ్తారా? వెళ్లరా? ఇలా. 

కానీ ఈ ఏడాది దాదాపుగా మీడియా జూనియర్ ఎన్టీఆర్ సంగతే మరిచిపోయింది. ఆయన కూడా సింపుల్ గా నిన్నటికి నిన్న తాత ఎన్టీఆర్ కు నివాళి అర్పించేసి, చెన్నయ్ వెళ్లిపోయారు. లోకల్ గా లేరు కాబట్టి, ఇక పిలిచారా? పిలవలేదా? వస్తారా?రారా? అన్న పాయింట్లే గుర్తుకురావు.  ఇప్పుడు నందమూరి వంశం తరపున ఏకైక ప్రతినిధి బాలయ్య మాత్రమే.  తరువాత ఆ వారసత్వం ప్లస్ నారా వారసత్వం అందుకునేందుకు లోకేష్ రెడీగా వున్నారు. 

అందువల్ల ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అనుకోవాలి. 2019 నాటికి చంద్రబాబు-లోకేష్ కాంబినేషన్లోనే తెలుగుదేశం ఎన్నికల ఫైట్ వుంటుంది. గెలిచిందా మళ్లీ వారే. ఓడినా మళ్లీ వారే.ఓడినంత మాత్రాన ఎన్టీఆర్ ను పిలచి పీట వేస్తారనుకొవడం భ్రమే.  అందువల్ల ఇప్పట్లో ఎన్టీఆర్ కు ఎంట్రీ వుండదు. సో బహుశా అందుకే మీడియా కూడా ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం విషయంలో అన్నీ పక్కన పెట్టేసినట్లుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?