Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇక మనం మీదనే నాగ్ సినిమాలు

ఇక మనం మీదనే నాగ్ సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఇప్పటిది కాదు. కానీ ఇప్పుడు కొత్తగా మనం ఎంటర్ ప్రైజెస్ వచ్చింది. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి సినిమా హలో. ఇకపై ఈ బ్యానర్ పైనే నాగార్జున సినిమాలు వుంటాయట. అన్నపూర్ణ స్టూడియోస్ అన్నది అక్కినేని ఫ్యామిలీ ఉమ్మడి బ్యానర్. దాన్ని అందరూ వాడతారు. సమర్పణ అన్నపుడు అందులో ఫ్యామిలీ అంతా వస్తారు. నిర్మాతగా నాగ్ పేరు వుంటూ వస్తోంది.

అయితే ఇప్పుడు కొత్తగా మనం పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసారు నాగ్. ఈ సంస్థలో కేవలం ముగ్గురే భాగస్తులంట. నాగ్, చైతూ, అఖిల్. ఈ ముగ్గురే మనం సంస్తలో వాటలు కలిగి వుంటారు. ఇకపై తీసే సినిమాలు మనం బ్యానర్ పైనేవుంటాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ కూడా వుంటుంది కానీ, స్టూడియో సర్వీస్ మేరకు చాలా చిన్న భాగస్వామ్యం మాత్రం వుంటుందని తెలుస్తోంది.

ఏమైనా వ్యాపారాలు ప్లాన్ చేయడం, అమలు చేయడం, పెట్టుబడులు పెట్టడం, వాటిని మల్టిపై చేయడంలో నాగ్ ది అందెవేసిన చేయి. అందుకే పిల్లలకు ఆ దిశగా కూడా తర్ఫీదు ఇస్తున్నట్లున్నాడు. ఇప్పటికే నాగ్ చైతన్యకు ప్రొడక్షన్ పనులు అన్నీ నేర్పించాడు. గతంలో ఒక లైలా కోసం సినిమా ప్రొడక్షన్ మొత్తం చైతన్యే దగ్గర వుండి చూసుకున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?