Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇక్కడ హిట్ కొట్టి అక్కడ తేలింది

ఇక్కడ హిట్ కొట్టి అక్కడ తేలింది

తెలుగులో సూపర్ డూపర్ హిట్ కొట్టినా ఒరిగింది ఏమీ లేదు పాపం పాప ప్రణీతకు. అయినా అంతకు ముందు వున్న పాత ఫ్లాపుల ట్రాక్ రికార్డు అలాంటిది. అందుకే ఇక్కడ పెద్దగా వచ్చిన సినిమలు లేవు అత్తారింటికి దారేది తరువాత. 

రభసతో ఎన్టీఆర్ పక్కన వేసినా, సమంత కన్నా బాగానే వుందని టాక్ వచ్చినా మళ్లీ మరో సినిమా రాలేదు. అయినా ఆ కన్నడ పోరిని మన తమిళ తంబిలు గుర్తించారు. ఏకంగా సూపర్ స్టార్ అజిత్ పక్కన చేసేందుకు ఎంచుకున్నారు. 

మాస్ పేరిట వెంకట్ ప్రభు చేస్తున్న సినిమాకు ఇప్పుడు ప్రణీతే కథానాయిక. వెంకట్ ప్రభు అంటేనే వైవిధ్యమైన సినిమాల దర్శకుడు. అందునా అజిత్ హీరో. ప్రణీతకు మాంచి బోణీయే తగిలింది తమిళనాట. ఇక దూసుకుపోతుందేమో?

అసలే సమంత తమిళనాట కాలూనదామని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.. త్రిష.తమన్నా,హన్సిక వంటి వాళ్లంతా జనాలకు మొహం మొత్తేస్తున్నారు. శృతి బిజీగా వుంది. అందువల్ల ప్రణీత హిట్ కొడితే తమిళ కోటలో పాగా వేసేస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?