Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ అలాగేనా చేసేది విజయ్?

మళ్లీ అలాగేనా చేసేది విజయ్?

తమిళ సినిమాలు తెలుగులో ఘన విజయం సాధిచించినవీ వున్నాయి..విఫలమైనవీ వున్నాయి.సూర్య, కార్తీ ల సినిమాలు తెలుగులో కొన్ని విఫలమైనా, కొన్ని విజయం సాధించినా దాని వెనుక వారి స్వంత బ్యానర్ వుంది.

అలాగే ఎఎమ్ రత్నం, బెల్లంకొండ సురేష్, ఇలా చాలా మంది గట్టి నిర్మాతలు తెలుగులోకి అరవ సినిమాలు తెస్తే వాటి రేంజ్ పెరిగిపోతుంది. కానీ ఈ విషయంలో విజయ్ కాస్త రాంగ్ స్ట్రాటజీలో వెళ్తున్నట్లుంది. తుపాకి సినిమా నిజానికి మంచి సినిమా.

కానీ దాన్ని తెలుగునాట సరిగ్గా ప్రమోట్ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్ కు విజయ్ తన పులి సినిమా అందించాడు. వారి ద్వారానే విడుదల చేస్తున్నా అన్నారు. అంటే తెలుగు హక్కులు ఇచ్చారో లేక, కమిషన్ బేసిస్ పై విడుదల చేయిస్తున్నారో. ఇప్పుడైనా ఆది నుంచి పులి సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకోవాల్సి వుంది,.

ఎందుకంటే అది కూడా భాహుబలి లాంటి జానపద సినిమా. గ్రాఫిక్స్ నిండుగా వున్న సినిమా. అందువల్ల ఏ మాత్రం బాగున్నా జనం మళ్లీ చూస్తారు. బాహుబలి రేంజ్ లో కాకున్నా కాస్త మంచి కలెక్షన్లు రావచ్చు. ఎప్పటికైనా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న విజయ్ ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?