Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇంకా లెజెండ్ పలవరింతే బోయపాటికి

ఇంకా లెజెండ్ పలవరింతే బోయపాటికి

దమ్ము తరువాత సినిమా రావడం చాలా కష్టమై, ఆఖరికి లెజెండ్ తో తానేమిటో ప్రూవ్ చేసుకు్న్నాడు బోయపాటి. అలాంటిది లెజెండ్ విడుదలై ఆరు నెలలు పూర్తవుతున్నా మరో సినిమా సెట్ పైకి వెళ్లలేదు. అల్లుడు శీను హీరో శ్రీనివాస్ తో సినిమా అని హడావుడిగా క్లాప్ కొట్టించారు. కానీ అది ఇఫ్పుడు తెరపైకి చేరుతుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో లెజెండ్ వ్యవహారమే మీడియా మరిచిపోతుంటే, తానే గుర్తు చేసుకుని సామూహిక ఇంటర్వూ తయారు చేసి విడుదల చేసారు దర్శకుడు బోయపాటి. అంతకన్నా ఈ సమయంలో మాంచి సినిమా ప్రకటన ఒకటి వెలువడి వుంటే బాగుండేది. నిజానికి బోయపాటి సత్తా వున్న దర్శకుడే. హీరోలు ఎవరైనా తాము కెలికేయ కుండా వాడుకోగలిగితే మాంచి హిట్ ఇవ్వగలవాడే. కానీ ఎందుకో దూరం పెడుతున్నారు. ఒక వేళ బెల్లంకొండ కొడుకు సినిమా లేకుంటే, మళ్లీ బాలయ్య వందో సినిమాతోనే వస్తాడేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?