Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇప్పుడేమంటారో?

ఇప్పుడేమంటారో?

చరణ్ మూడు కోట్లు వెనక్కు ఇచ్చాడట బండ్ల గణేష్ కు. గోవిందుడు అందరి వాడేలే సినిమా కొని గుల్లయిపోయిన డిస్టిబ్యూటర్లకు తలాకాస్తా ఇమ్మని. బయ్యర్లు నష్టపోయినదాన్ని చూసుకుంటే తక్కువే కానీ,  రామ్ చరణ్ తీసుకున్న దానితో పోల్చుకుంటే ప్రశంసించాల్సిన నిర్ణయమే. ఎందుకంటే ఒక్క గుంటూరు డిస్టిబ్యూటర్ 80 లక్షల నుంచి కోటికి పైగా పోగొట్టుకున్నారని వార్తలు వినవస్తున్నాయి. 

కానీ చిత్రంగా సినిమా విడుదలైన దగ్గర నుంచి ఏ విధమైన అభిమానమో, మరే సంబంధమో కానీ తెగ మోసారీ సినిమాను. వాస్తవ అంకెలకు అంతకు అంతా కలిపేసి, ఇంత అంత అంటూ తెగ ప్రచారం చేసారు. ఇంకా దున్నేస్తోంది..ఇంకా కుమ్మేస్తోంది అంటూ వండి వార్చారు. మరి అంతలా చేస్తే ఇంత లోటు ఎందుకు వస్తుంది?

అయితే అదృష్టం ఏమిటంటే, ఈ సినిమాకు ఆగడు మాదిరిగా అడ్డగోలుగా ఖర్చుచేసేసి, బడ్జెట్ ను 60 కోట్లకు చేర్చేయలేదు.  సినిమా  భారీ బడ్జెట్ సినిమా  కాదు. స్టార్ కాస్ట్ ఎక్కువే కానీ, మేకింగ్ భారీ తనం ఏమీ లేదు. మహా అయితే ముఫై వరకు ఖర్చయి వుంటుంది. లేదూ అంటే మరో అయిదు. 

అంటే ముఫై అయిదు కోట్లు వస్తే సరిపోతుంది.  ముఫై అయిదులో శాటిలైట్ అయిదు పోతుంది. శాటిలైట్ తొమ్మిది అని హడావుడి చేసారు అనీ అయిదే అన్నది వాస్తవం అంటున్నారు. అంటే అక్కడికి ఇంకో ముఫై వస్తే చాలు నిర్మాణ వ్యయం గట్టేక్కేస్తుంది. నైజాం కలెక్షన్లు బాగానే వున్నాయి. నిర్మాత ఆ ప్రాంతంలో నేరుగా పంపిణీ చేసుకున్నారు. కొన్ని ఏరియాలు మంచి రేటుకే అమ్మారు.   కాబట్టి గోవిందుడు నిర్మాతకు లాస్ కానే కాదు.

అయితే కొన్నయినా ఏరియాలు కొన్నవారు మాత్రం నష్టపోయారు. వారికి రామ్ చరణ్ ఇచ్చిన ఈ మూడు కోట్లు కాస్త ఊరట. బండ్ల గణేష్ వచ్చే ఎన్టీఆర్ సినిమాకు రిబేటు ఇస్తే అది మరింత ఊరట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?