Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జగపతి కల అలా తీరుతోంది

జగపతి కల అలా తీరుతోంది

టాప్ మెగా హీరోలతో నటించలేదనే చిన్న అసంతృప్తి వుండిపోయింది హీరో కమ్ విలన్ జగపతి బాబుకు. అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. విలన్ గా మారాక మరీ పాపులర్ అయ్యాడు. అయినా మెగా హీరోల సినిమాల్లో చేయలేదన్న చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. ఇప్పుడు అది తీరిపోతోంది.

చిరంజీవి హీరోగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న భారీ మల్టీ స్టారర్ లో జగపతి బాబుకు కూడా చాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. సైరా సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రనే జగపతి బాబుకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఉయ్యాల వాడ నరసింహా రెడ్డితో నమ్మకంగా వుంటూనే, వెన్నుపోటు పొడిచి, బ్రిటిష్ వాళ్లకు ఆచూకీ తెలియచేసే పాత్ర జగపతి బాబు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బాగా ఫెమిలియర్ కావడం అన్నది జగపతిబాబుకు కలసి వచ్చింది. మెగా హీరోలతొ నటించాలన్న కోరిక ఇలా తీరింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?