Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జై లవకుశ @ 120 కోట్లు

జై లవకుశ @ 120 కోట్లు

ఎన్టీఆర్ జైలవకుశ సినిమా విడుదల డేట్ వచ్చేసింది. ఈ మధ్య తెలుగు టాప్ సినిమాల మార్కెట్ రేంజ్ భయంకరంగా పెరిగింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ వంద కోట్లను దాటేస్తున్నాయి.

అయితే వందకోట్లకు పైగా బడ్జెట్ తో తయారవుతున్న పవన్ సినిమా, మహేష్ సినిమా వందకోట్ల రేంజ్ మార్కెట్ చేయడం వేరు, 70కోట్ల రేంజ్ లో తయారవుతున్న ఎన్టీఆర్ సినిమాకు కూడా వందకోట్లకు పైగా మార్కెట్ కావడం వేరు.

జైలవకుశ మార్కెట్ అన్నీ కలిపి 100-110 కోట్ల రేంజ్ లో అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ సినిమాకు నిర్మాణ వ్యయం ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్ 18కోట్లతో కలిపి 68కోట్లు అవుంతోంది. మహా అయితే మరో రెండు కోట్లు పబ్లిసిటీ. మొత్తం 70కోట్లు.

అయితే ఇప్పటికే 16.5 కోట్లకు శాటిలైట్ ఇచ్చేసారు. 1.3 కోట్లకు అడియో ఇచ్చేసారు. అదర్ లాంగ్వేజ్ శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి 9 వరకు పలికినట్లు తెలుస్తోంది. నైజాంను దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు.

రేటు ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, 18వరకు వుండొచ్చని తెలుస్తోంది ఈ లెక్కన ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి 70కోట్ల వరకు మార్కెట్ అంచనా వేస్తున్నారు. ఆంధ్రనే 40కోట్ల రేంజ్ లో చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 35 దగ్గర సెటిల్ అవుతుంది.

ఆ రేషియోలో నైజాం, సీడేడ్ కూడా వుంటాయి. అంటే ఏపీ తెలంగాణ థియేటర్ రైట్స్ నే 70కోట్లు వస్తాయి. ఇంకా కర్ణాటక, ఓవర్ సీస్, అదర్ ఏరియాలు, అన్నీ కలిపి మొత్తం టోటల్ మార్కెట్ 120కోట్ల వరకు వుంటుందని అంచనా వేస్తున్నారు. దాన్ని దాటినా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే, స్పాన్సర్ షిప్ బ్రాండింగ్ అగ్రిమెంట్ లు డిస్కషన్ లో వున్నాయి. అవి ఓ పదికోట్ల వరకు వస్తాయని తెలుస్తోంది. మొత్తంమీద కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ లో ఇంత రేంజ్ సినిమా, ఇంత ప్రాఫిటబుల్ సినిమా ఇదే తొలిసారి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?