Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జై లవకుశ టీజర్ లీక్..!?

జై లవకుశ టీజర్ లీక్..!?

టాలీవుడ్ కు లీకుల బెడద ఎక్కువైపోయింది. ఎంత స్వంత ఎడిటింగ్ సూట్లు పెట్టుకుని, కాపాడుకుంటున్నా, ఎక్కడో దగ్గర లీక్ అయిపోతోంది. ఎవరో ఒకరు దొరుకుతున్నారు. ఇప్పుడు జై లవకుశ వంతు వచ్చింది. జై లవకుశ టీజర్ అంటూ వాట్సఫ్ లో ఓ టీజర్ ప్రత్యక్షమైపోయింది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పేరు కూడా కాంటెంపరీగా మాంచి స్టయిలిష్ ఇంగ్లీష్ అక్షరాల్లో చూపించారు.

విశ్వ విశ్వపాలక, రావణ.. రావణ అంటూ నేఫథ్యంలో పాట వస్తుంటే, ఎన్టీఆర్ పాత్ర కారుదిగి బయటకు రావడం కనిపిస్తుంది. వెనక రావణబ్రహ్మ పది తలకాయలు కనిపిస్తుంటే, దాని ముందు ఎన్టీఆర్ అలా అలా రైజ్ అవుతూ కనిపిస్తారు.

ఆ తరువాత మోడరన్ కు, పౌరాణానికి కలిపి క్రియేట్ చేసిన సింహాసనం, అందులో గొడ్డలి పట్టుకుని, భారీగా ఎన్టీఆర్ వికటాట్టహాసం. ఆపై జై లవకుశ అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో టీజర్ ముగుస్తుంది. బహుశా ఈ టీజర్ ను రంజాన్ కు వదుల్దామని అనుకున్నట్లు వుంది. కానీ ఎందుకో ఆగారు. టీజర్ చివర్న నెలవంక తదితర చిహ్నాలు కనిపించడం బహుశా అందుకేనేమో?

ఏమైనా మాంచి టీజర్ ఇలా లీకైపోవడం చాలా విచారమే. ఫ్యాన్స్ కు చాలా డిస్సపాయింట్ మెంట్. ఇప్పుడు మళ్లీ మరో మాంచి టీజర్ వదలక తప్పదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?