Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జై లవకుశలో ఫుల్ పాలిటిక్స్?

జై లవకుశలో ఫుల్ పాలిటిక్స్?

జై లవకుశకు సంబంధించిన ఓ కథ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కథ ఎలా వుంది? నమ్మశక్యంగా వుందా లేదా? అన్నది పక్కన పెడితే, ఆ సినిమాలో కీలక పాత్ర, నెగిటివ్ షేడ్ వున్న జయ్ క్యారెక్టర్ ఫుల్ గా పాలిటిక్స్ లో ఇన్ వాల్వ్ అయివుంటుందట. ఆ పాత్రకు కొంచెం నత్తి వుంటుంది. దీంతో చిన్నతనంలో కాస్త ఎగతాళికి గురవుతుంది.

కానీ అపరిమితమైన తెలివితేటలు వుండడంతో ఓ రాజకీయ నాయకుడి ఆశ్రయం పొంది, అతని ఉన్నతి కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తుంది. ఆఖరికి ఆ రాజకీయ నాయుకుడిని దారి నుంచి తప్పించి, తానే లీడర్ అవుతుందా పాత్ర. (మోహన్ బాబు నటించిన ఎమ్ ధర్మరాజు ఎమ్ఎ గుర్తుకు వస్తోందా?) ఈ క్రమంలో చాలా పొలిటికల్ స్పీచ్ లు వుంటాయని టాక్ వినిపిస్తోంది. కానీ ఇవేవీ చంద్రబాబును టార్గెట్ చేసేలా మాత్రం వుండవు.

ఇదిలా వుంటే కథ ప్రకారం మిగిలిన ఇద్దరు ట్విన్స్ (లవకుశ) అన్నను డీకొంటారని, చివరకు ఊహించని పరిణామం జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కథ ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ, ఆసక్తి కరంగానే వుంది. అయితే ఇంత క్లిష్టమైన కథను, దర్శకుడు బాబీ ఏ మేరకు హ్యాండిల్ చేయగలడన్నది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?