Advertisement


Home > Movies - Movie Gossip
జై లవకుశ ముగింపు మార్చారా?

జై లవకుశ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా. ఈ సినిమా కథపై ఇప్పటికే జనాలకు కాస్త అవగాహన వచ్చేసింది. దానికి తోడు గుసగుసల ద్వారా కథ బయటకు చాలా వచ్చేసింది.

చిన్నతనంలోనే నాటకాల కంపెనీని జై తగులబెట్టేసి వెళ్లడం, ముగ్గురు ఎవరికి వారు మిగిలిన వారు చనిపోయారని అనుకోవడం, కానీ అంతలోనే లవుడు, కుశుడు కలవడం, హ్యాపీగా వున్న టైమ్ లో జై సీన్ లోకి రావడంతో కథ రసపట్టులో పడుతుంది. ఇలా వినిపిస్తున్న కథకు ముగింపు ఏమిటన్నది క్వశ్చను.

ఇప్పటి దాకా అయితే క్లయిమాక్స్ లో లవుడు, కశుడు కలిపి, జైని కడతేర్చుతారని టాక్ వినిపించింది. కానీ జై లాంటి బలమైన క్యారెక్టర్ ను కడతేర్చాలి అంటే ఆ పాత్ర చేసే పనులు అంత రేంజ్ లో వుండాలి. అప్పుడు కూడా మన ప్రేక్షకులను ఆ ముగింపు చేత అంగీకరింపచేయగల సత్తా డైరక్టర్ కు వుండాలి.

అయితే జై లవకుశలో విషాదాంత ముగింపే వుంటుందని ఆదిలో వినిపించింది. కానీ ఇప్పుడు కొత్తగా మార్చారన్న టాక్ వినిపిస్తోంది. ఏది నిజమో అన్నది పక్కాగా తెలియదు. సెన్సారు రిపోర్టు బయటికి వెచ్చేసరికి గుసగుసలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏ సంగతీ తెలిసే అవకాశం ఎక్కువగా వుంది.