Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జవాన్ పెర్ ఫెక్ట్ అంట

జవాన్ పెర్ ఫెక్ట్ అంట

సాయిధరమ్ తేజ జవాన్ పై ఈ మధ్య చాలా నెగిటివ్ వినిపించింది. అయితే ఈ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 1న విడుదల అని ప్రకటించారు. ఇలా డేట్ ప్రకటించడానికి, గ్యాసిప్ లు వినిపించడానికి మధ్య చాలా జరిగిందని తెలుస్తోంది.

సినిమాను ఒకటికి రెండు సార్లు దిల్ రాజు చూసి, సలహాలు, సూచనలు అందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సినిమా బాగానే వచ్చిందని, కానీ అక్కడక్కడ చిన్న ఛేంజెస్ మాత్రమే అవసరం పడతాయని దిల్ రాజు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు సూచనల మేరకు దర్శకుడు బివిఎస్ రవి సినిమాను పెర్ ఫెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ పూర్తయిన తరువాత సినిమాను మళ్లీ ఓసారి చూసుకుని, అప్పుడు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట దిల్ రాజు. ఈ సినిమాతో హిట్ డైరక్టర్ అనిపించుకుంటా అని బివిఎస్ రవి సన్నిహితుల దగ్గర ధీమా వ్యక్తం చేస్తున్నారట.

జవాన్ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు కృష్ణ. ఇన్నాళ్లు ఆయన నిర్మాణ వ్యవహారాలు చూడడమే కానీ, నిర్మాతగా మారుతున్నది ఇప్పుడే, జవాన్ తరువాత ఓ భారీ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంమీద ఎవరు చూసినా, ఏం చేసినా, ఒక్క హిట్ పడితే సాయిధరమ్ తేజ మార్కెట్ స్టేబుల్ అయిపోతుంది. అన్నట్లు జవాన్ లో మెహరీన్ నటిస్తోంది. ఆమె నటన సంగతి ఎలా వున్నా, ఇప్పటి దాకా నటించిన మూడు సినిమాలు హిట్ లే. ఆ గోల్డెన్ లెగ్ కూడా జవాన్ కు ప్లస్ అవుతుందేమో? చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?