Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అసలు విషయం చెప్పి తప్పుచేశారా..?

అసలు విషయం చెప్పి తప్పుచేశారా..?

అసలే వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నాడు. మంచి సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో సాయిధరమ్ తేజ్ ఆశలపై నీళ్లుచల్లింది జవాన్ ట్రయిలర్. కొన్ని గంటల కిందట విడుదలైన ఈ ట్రయిలర్.. సినిమాపై అంచనాలు పెంచకపోగా ఆసక్తిని తగ్గించేసింది. 

అవును.. జవాన్ ట్రయిలర్ లో ఆల్ మోస్ట్ అంతా చూపించేశారు. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది. ఫైనల్ గా ఎలాగూ హీరో గెలుస్తాడు కాబట్టి సినిమా చూడకపోయినా ఫర్వాలేదు. అలా విషయం మొత్తం చెప్పేశారు జవాన్ ట్రయిలర్ లో.

ఆక్టోపస్ మిస్సైల్ ను సైన్యానికి దక్కకుండా తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటాడు విలన్. దాన్ని హీరో అడ్డుకుంటాడు. ఫైనల్ గా గెలుపెవరిదనే విషయం తెలుగు సినిమాల్ని చూసే ప్రేక్షకుడు ఎవరైనా చెప్పేస్తాడు. దీనికి తోడు "యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.." అంటూ చెప్పే డైలాగ్,  సినిమా ఏంటనేది విషయాన్ని చెప్పకనే చెప్పేస్తోంది.

ఇవన్నీ పక్కనపెడితే ప్రసన్న ఇందులో విలన్ గా నటిస్తున్నాడనే విషయాన్ని చెప్పకుండా దాచినా ఉన్నంతలో బజ్ క్రియేట్ అయ్యేది. హీరో ఫ్యామిలీకి, ఆక్టోపస్ మిస్సైల్ కు లింక్ ఏంటనేది ఈ ట్రయిలర్ లో కాస్తోకూస్తో ఇంట్రెస్టింగ్ మేటర్. ఇలా ముందే అన్నీ చెప్పేసిన జవాన్.. థియేటర్లలో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?