Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జయదేవ్ ఫంక్షన్ కు బన్నీ

జయదేవ్ ఫంక్షన్ కు బన్నీ

మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ హీరోగా నటించిన సినిమా జయదేవ్. ఈ సినిమా 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగినపుడు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.

ఇప్పడు అలాంటి ఫంక్షన్ విశాఖలో జరుగుతోంది. దీనికి మెగా లెగసీ ని కంటిన్యూ చేసే దిశగా పయనిస్తోన్న అల్లు అర్జున్ హాజరవుతున్నారు.

ఈ ఫంక్షన్ విశాఖ నోవాటెల్ లో బుధవారం జరుగుతుంది. గంటా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి విడదీయలేని బంధం వుంది. ఆ బంధంతోనే చిరంజీవి ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చారు.

ఇప్పుడు బన్నీ వెళ్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమాను తెలుగులో జయదేవ్ గా అందిస్తున్నారు. గతంలో పలు సూపర్ హిట్ లు అందించిన జయంత్ సి పరాన్జీ ఈ సినిమాకు దర్శకుడు. అశోక్ కుమార్ నిర్మాత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?