Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాతనోట్లు.. జీవిత, రాజశేఖర్ ఇన్ డీప్ ట్రబుల్!

 పాతనోట్లు.. జీవిత, రాజశేఖర్ ఇన్ డీప్ ట్రబుల్!

ఏడు కోట్ల రూపాయల పాత నోట్ల డంప్ దొరికింది హైదరాబాద్ లోని జీవితా రాజశేఖర్ ఇంటి పై పోర్షన్ మీద. ఆ నోట్లను మార్పిడి చేసే ప్రయత్నం చేసిన వాళ్లలో ఒకరు జీవితకు సమీప బంధువు.

దీంతో ఆ నోట్లతో జీవిత, రాజశేఖర్ లకు సంబంధం ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తమకు ఏపాపం తెలియదని జీవిత వివరణ ఇచ్చుకుంది. తమ ఇంటి పై పోర్షన్ లో అలాంటి పని జరుగుతోందని తమకు అస్సలు తెలియదని జీవిత చెప్పారు.

మరి ఇదంతా వారికి తెలియకుండానే జరిగిందని అనుకుందాం.. అయితే, ఇప్పుడు పోలీసులు వెలికి తీసిన అసలు కథ మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు చెబుతున్న విషయం ఏమిటంటే.. ఆ పాత నోట్లు తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తివి అని. అతడి పేరు కోటేశ్వర రాజు.

అతడొక సినీ నిర్మాత అని పోలీసులు చెబుతున్నారు. అతడు నిర్మిస్తున్న ప్రస్తుత సినిమా ఏదో తెలుసా? ‘పీఎస్ వీ గరుడ వేగ’.

ఆ సినిమాలో హీరో రాజశేఖర్ అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మొదటి నుంచి వస్తే.. రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా యొక్క ప్రొడ్యూసర్ పాత నోట్లను మార్పిడీ చేయాలని ప్రయత్నించాడు. ఆ నోట్లను హైదరాబాద్ కు పంపించాడు.

అవి రాజశేఖర్ ఇంటి మీద దొరికాయి.. ఇందులో వీరి సమీప బంధువు ఒకరు నిందితుడిగా కనిపిస్తున్నాడు. కానీ.. తమ ఇంటి మీద ఇలాంటి పని జరిగిందని తమకు తెలీయదని వారు అంటున్నారు! ప్రస్తుతం ఆ కోటేశ్వర రాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?