Advertisement


Home > Movies - Movie Gossip
జూలై నుంచి చైతూ రెండు సినిమాలు

నాగ్ చైతన్య రాను రాను నిర్మాత హాట్ ఫేవరెట్ గా మారుతున్నాడు. మే నెలలో ఓ సినిమా విడుదల కాబోతోంది. మరో సినిమా ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. జూలై లో మరో రెండు సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి. స్వంత బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను ఫినిష్ చేసాడు. మే నెలలో విడుదలకు రెడీ చేసారు.

మరోపక్క సాయి కొర్రపాటి నిర్మాణంలో, కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయిపోయింది. మరోపక్క చందు మొండేటితో ఓ కథ ఓకె చేసేసాడు. కాస్త యాక్షన్ పార్ట్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ వుండే సబ్జెక్ట్ ఇది. ఈ సినిమాను జూలై నుంచి ప్రారంభిస్తున్నారు.  ఇదిలా వుంటే ప్రేమమ్ సినిమా చేసిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూడా చైతూతోనే మరో సినిమా చేయాలని చూస్తోంది. కథ కు చైతూ ఓకె చెబితే, ఇది కూడా జూలై నుంచే ప్రారంభమవుతుంది. అంటే ఈ ఏడాది కనీసం మూడు సినిమాలు విడుదయ్య అవకాశం వుందన్నమాట చైతూకి.