Advertisement


Home > Movies - Movie Gossip
కాజల్ కు అదనంగా సమర్పించుకున్నారు?

నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం కాజల్ ఎంతలా ప్రచారం చేసిందో చూశారా.. దాదాపు వారం రోజుల పాటు రానాతో కలిసి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు చుట్టేసింది. ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేసింది. మరి కాజల్ ఏంటి..? ఓ సినిమాకు ఈ రేంజ్ లో ప్రచారం కల్పించడం ఏంటనే అనుమానం మీకు రాలేదా..? 

గతంలో ఎప్పుడూ కాజల్ ఇంత ఎగ్రెసివ్ గా మూవీ ప్రమోషన్ లో పాల్గొనలేదు. ప్రచారానికి చాలా దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటిది నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ఇంతలా ప్రమోట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? కేవలం రానా అంటే ఇష్టం కాబట్టి ఇంత ప్రచారం కల్పించిందని అనుకోలేం. 

ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే అదనంగా ఇంకాస్త సమర్పించుకోవడం వల్లే కాజల్ ఇంతలా ప్రచారం చేసింది. తాజా సమాచారం ప్రకారం కేవలం ప్రమోషన్ కోసమే వారం రోజులకు 30లక్షల రూపాయలు సమర్పించుకున్నారట నిర్మాతలు. అందుకే కాజల్ ఒప్పుకుంది తప్ప మరే రీజన్ లేదంటున్నారు. 

హిందీ సినిమాలకు మాత్రం కాజల్ ఎప్పుడూ ఇలాంటి కండిషన్లు పెట్టలేదు. అవకాశం రావడమే మహాప్రసాదం అనుకుంటూ అక్కడ చేసే బి-గ్రేడ్ సినిమాలకు కూడా బీభత్సంగా ప్రమోషన్ ఇస్తుంది. కానీ సౌత్ కు వచ్చేసరికి మాత్రం ప్రచారం అంటే అదేదో తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు మాట్లాడుతుంది. ఎక్స్ ట్రా చార్జ్ చేస్తుంది.