Advertisement


Home > Movies - Movie Gossip
ఆమె కోసం: అటు సీనియర్లు.. ఇటు కుర్ర హీరోలు

వెండితెరపై కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150సినిమా చేసిన కాజల్, ఆ తర్వాత సీనియర్ హీరోలతోనే కనిపించింది. విజయ్, అజిత్ లాంటి వాళ్లతో సినిమాలు చేసింది. కానీ సడెన్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా సరసన మెరిసింది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే సినిమాలో నటిస్తోంది. కాజల్ సరసన నటించే కుర్రహీరోల లిస్ట్ లోకి ఇప్పుడు శర్వానంద్ కూడా చేరాడు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ ప్రారంభించాడు శర్వానంద్. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యామీనన్ ను ఇప్పటికే సెలక్ట్ చేశారు. మెయిన్ హీరోయిన్ గా కాజల్ ను తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. ఇందులో నటించడానికి కాజల్ దాదాపు అంగీకరించింది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్ లో నటిస్తోంది కాజల్. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమాతో పాటు తేజ దర్శకత్వంలో వెంకీ హీరోగా రాబోతున్న సినిమాలో కూడా కాజల్ నటించే అవకాశం ఉంది. ఇలా ఇటు సీనియర్లు, అటు కుర్రహీరోల్ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ ను పరుగులుపెట్టిస్తోంది బ్యూటిఫుల్ కాజల్.