Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కాజల్‌ గట్టిగానే లాగేస్తోందట

కాజల్‌ గట్టిగానే లాగేస్తోందట

'ఐటమ్‌ సాంగ్స్‌ నేను చేయలేను.. స్పెషల్‌ సాంగ్‌ అని పేరు పెట్టినాసరే.. నా వల్ల కాదు..' అని గతంలో చెప్పిన కాజల్‌ అగర్వాల్‌, ఇప్పుడు ఐటమ్‌ సాంగ్‌కి ఎందుకు 'సై' అన్నట్టు.? టాలీవుడ్‌ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు పెద్ద ఫ్లాప్స్‌ వచ్చాక, కాజల్‌ ఇమేజ్‌ బాగానే డ్యామేజ్‌ అయ్యింది. 

మామూలుగా పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తే, అవి ఫ్లాపయినా హీరోయిన్లకు వచ్చే డ్యామేజీ పెద్దగా ఏమీ వుండదు. కానీ, కాజల్‌ విషయంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. కాజల్‌ని టాలీవుడ్‌ పట్టించుకోవడమే మానేసింది. దాంతో, కాజల్‌ ఇప్పుడు తన ఉనికి కోసం టాలీవుడ్‌లో కొత్తగా ట్రై చెయ్యాల్సి వస్తోంది. అందుకే, 'జనతా గ్యారేజ్‌' కోసం ఐటమ్‌ సాంగ్‌ ఆఫర్‌ వస్తే కాదనలేకపోయిందట. 

మరోపక్క, ముందుగా తమన్నాతో ఐటమ్‌ సాంగ్‌ చేయిద్దామనుకున్నా, చివరి నిమిషంలో ఆ ఛాన్స్‌ కాజల్‌కి ఇచ్చింది 'జనతా గ్యారేజ్‌' టీమ్‌. ఇందుకోసం కాజల్‌కి బాగానే ముట్టచెబుతున్నారట. అదెంత.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. తొలిసారిగా కాజల్‌ ఐటమ్‌ సాంగ్‌ చేస్తుండడంతో, 'జనతా గ్యారేజ్‌'కి ఇదొక యాడెడ్‌ ఎట్రాక్షన్‌ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఈ ఏడాది రెండు ఫ్లాప్స్‌ ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న కాజల్‌కి, ఈ ఐటమ్‌ సాంగ్‌ కలిసొస్తుందా.? వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?