Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ సినిమాకు సూపర్ రేట్

కళ్యాణ్ రామ్ సినిమాకు సూపర్ రేట్

కళ్యాణ్ రామ్-తమన్నా కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా జాక్ పాట్ కొట్టింది. జెమిని సంస్థ ఈ సినిమా శాటిలైట్ హక్కులు 4.75 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ సినిమాకు దగ్గర దగ్గర అయిదు కోట్ల శాటిలైట్ రేటు అంటే సూపర్ అన్నమాటే. తమన్నా కూడా వుండడంతో సినిమాకు మాంచి బజ్ వచ్చింది. పైగా జయేంద్ర, పిసి శ్రీరామ్ వంటి రిచ్ సాంకేతిక వర్గం వుండడం కలిసి వచ్చింది.

దాదాపు 50శాతం సినిమా టాకీ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు మార్చి విడుదల టార్గెట్ గా సాగుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా కోసం కళ్యాణ్ కొత్తగా సాఫ్ట్ లుక్ తో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ముందుగా కళ్యాణ్ రామ్ తో బ్లూప్లానెట్ సంస్థ నిర్మించే ఎంఎల్ఎ సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. కొత్త దర్శకుడు ఉపేంద్ర ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?