Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కాటమరాయుడు రేంజ్ ఎంత.. తేలేది ఈ వారమే...?

కాటమరాయుడు రేంజ్ ఎంత.. తేలేది ఈ వారమే...?

కాటమరాయుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సినిమా రిలీజైన రోజు నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. క్రిటిక్స్ పెన్ కు పని చెప్పారు. మరోవైపు వసూళ్ల లెక్కలు కూడా మొదలయ్యాయి. ఇంతకీ కాటమరాయుడు సినిమా రిజల్ట్ ఏంటి...? పవన్ నటించిన ఈ సినిమా ఇంకా ఎన్ని రోజులు ఆడుతుంది...? ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది..? ఈ సినిమా రేంజ్ ఎంతో ఇవాళ్టి నుంచి తెలుస్తుంది. 

కాటమరాయుడు సినిమా చాలా బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఓ మోస్తరుగా ఉందని రివ్యూలు అంటున్నాయి. వీళ్లలో ఎవరు చెప్పేది నిజం. నిన్నటి వరకు థియేటర్ల వద్ద అభిమానుల హంగామా నడిచింది. కానీ ఇవాళ్టి నుంచి సినిమా ఆడాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాలి. 

మరోవైపు కాటమరాయుడు సినిమాకు పైరసీ ఎఫెక్ట్ బాగానే తగుల్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమా క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో కనిపించాయి. కొన్ని సైట్స్ లో టోటల్ మూవీనే అప్ లోడ్ చేశారు. సినిమా లాంగ్ రన్, వసూళ్లపై పైరసీ కూడా కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు గురు, రోగ్ వంటి సినిమాల రాకతో ఈ శుక్రవారానికి కాటమరాయుడుకు థియేటర్లు కూడా తగ్గుతాయి. సో... కాటమరాయుడు రేంజ్ ఏంటో ఈ వారంలో తెలిసిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?