Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కార్తికేయ చూస్తున్న ఆర్ బి చౌదరి

కార్తికేయ చూస్తున్న ఆర్ బి చౌదరి

కార్తికేయ సినిమా తెలుగులో సర్ ప్రయిజ్ హిట్. నిజానికి ఆ సినిమా తమిళ్ కు ఇంకా బాగా సూటవుతుందని ముందే అనుకున్నారు. ఆ మేరకు డబ్ చేసే పని మొదలెట్టారు. సెన్సారు చేయించి, రెండూ ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత లింగుస్వామి తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఇంతలో ఆయన సికిందర్ పనిలో పడడం, ఆ తరువాత అది ఫెయిల్ కావడం ఇలా జరిగి, ఆయన దూరం జరిగారు. 

ఇప్పుడు సినిమా హిట్ అయిన తరువాత తెలుగు నిర్మాతే తమిళంలో కూడా నేరుగా విడుదల చేసుకుందామనుకున్నారు. ఎడిటర్ మోహన్ తాను సాయం చేస్తామన్నారు. కానీ ఇంతలో ఆర్ బి చౌదరి రంగప్రవేశం చేసినట్లు తెలిసింది. తాను ఓ సారి సినిమా చూడాలనుకుంటున్నట్లు నిర్మాతకు కబురు చేసిటన్లు బొగట్టా. అందుకోసం సోమవారం ప్రసాద్ ల్యాబ్ లొ షో ఏర్పాటు చేస్తున్నారు. 

మరి ఆయన తాను పంపిణీ చేసేందుకు అడిగారా..లేక ఇంకేమైనా అని సందేహం. ఎందుకంటే పంపిణీకి అయితే అంత పత్యేకంగా చూడక్కరలేదు. అదే తన కొడుకు జీవా హీరోగా రీమేక్ చేసుకోవాలనుకుంటే మాత్రం చూడాల్సిందే.  అలా అయితే నిర్మాత పంట పండినట్లే. కానీ పాపం నిఖిల్ కు మాత్రం తమిళంలో మాంచి పరిచయం మిస్సవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?